Sunday, December 22, 2024

నీళ్ల బాటిల్ లో పురుగుల మందు..

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: తను తాగే మంచినీళ్ల బాటిల్ లో పురుగుల మందు కలిపారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన వైనం కారేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండల పరిధిలోని గిద్దెవారిగూడెంకు చెందిన కల్తి భద్రయ్య అనే రైతుకు వారి గ్రామానికి, వెంకటియా తండాకు మధ్యలో ఒక ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఇటీవల అందులో వరి కోస్తుండగా వరి కోత మిషన్ తగిలి పక్కనున్న పొడుగు వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన గట్టుమీద ఉన్న రాయి పక్కకు ఒరిగినది. దానిని తాను సరి చేస్తానని చెప్పినా వినకుండా వెంకటేశ్వర్లు అతనితో గొడవకు దిగి, తనను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు.

ఎప్పటిలాగే భద్రయ్య చేను వద్ద మోటార్ పంపు వద్ద చెట్టుకు తగిలించిన మంచి నీళ్ల బాటిల్ లో పురుగుల మందు కలిపి ఉంది. నీళ్లు తాగుదామనుకున్న భద్రయ్య ఒక గుటక వేయగానే నీళ్లు అదొక రకంగా రుచి, వాసన ఉండడంతో అనుమానం వచ్చి చూడగా నీళ్లన్నీ పాలు లాగా తెల్లగా ఉన్నాయి. ఆ నీటిని గ్రామ సర్పంచ్ కు, గ్రామ పెద్దలకు చూపించిన కల్తి భద్రయ్య తన మంచినీళ్ల బాటిల్ లో పొడుగు వెంకటేశ్వర్లు మందు కలిపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు .ఈ విషయమై తగు విచారణ చేసి, ఆ మందు కలిపిన వ్యక్తులు ఎవరో తెలుసుకొని, వారిని శిక్షించాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News