Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో అరుదైన పిల్లి కిడ్నాప్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఓ అరుదైన జాతి పిల్లిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన జంతు ప్రేమికులను కలచివేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురలో చోటుచేసుకుంది. తప్పిపోయిన పిల్లి ‘ఖౌమనీ’ జాతికి చెందినట్లు సమాచారం. ఇది ఒక నీలం రంగు, ఒక ఆకుపచ్చ రంగు కన్ను కలిగి ఉందని పిల్లి యజమాని తెలిపాడు. 18 నెలల పెంపుడు పిల్లి యజమాని మహ్మద్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన ఫిర్యాదు దాఖలు చేశాడు. అతను రూ. 50,000కి కొనుగోలు చేసినట్లు పోలీసులకు చెప్పాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి పిల్లిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Pet cat kidnapped in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News