Wednesday, January 22, 2025

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పెంపుడు కుక్క

- Advertisement -
- Advertisement -

నవరాత్రులు గణపతి పూజలో పెట్టిన వస్తువులు మనకు లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలమని అంటారు పెద్దలు. దేవతలలో ఆదిదేవుడిగా చెప్పుకునే గణపతికి తొమ్మిది రోజులపాటు పూజలు ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ ఉత్సవాలలో గణపతి వద్ద పెట్టిన వస్తువులను చివరి రోజు వేలం వేస్తుంటారు. ఆ వేలంలో గెలిచిన వస్తువులను దేవుడు ఇచ్చిన ఫలంగా భక్తులు భావిస్తారు. హనుమకొండ హనుమకొండ డబ్బాల్ ప్రాంతంలోని శ్రీ గజానన మండపం వద్ద విచిత్ర సంఘటన జరిగింది. గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డూను లక్కీ డ్రాలో పెంపుడు శునకానికి బంపర్ లక్కీ డిప్ ఆఫర్ తగిలింది. దీంతో ఆ కుక్క యాజమాని కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఇదే ప్రాంతానికి చెందిన రాజేష్, వాణి దంపతులు తమ కుటుంబ సభ్యులతో పాటు వారి ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్క

సోనీ పేరిట కూడా ఒక లక్కీ డ్రా చిట్టీ రాసి మండపంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేశారు. సోమవారం గణపతి నిమజ్జనం సందర్భంగా ఉత్సవ కమిటీ వారు లక్కీ డ్రా తీసిన క్రమంలో లడ్డూ పెంపుడు కుక్క సోనీ పేరుపై వచ్చింది. ఎల్లప్పుడు కుక్క కూడా తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మెలుగుతోందని, తమ శూనకానికి గణేశుడి లడ్డూ దక్కడం తమ ఇంటి సభ్యుడికి వచ్చినంత ఆనందంగా ఉందని ఆ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. గణపయ్యను గంగమ్మ ఒడికి తరలిస్తున్న తరుణంలో లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ దక్కిందన్న వార్త వరంగల్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా గణపతి లడ్డూ దక్కడం అదృష్టం అంటూ పలువురు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News