సంగారెడ్డి : పెంపుడు జంతువులు ప్రేమించడానికి ఎంతో మురిపెంగా ఉంటాయని, నిర్లక్షంగా ఉంటే అంతే ప్రమాద ముంటుందని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా పశు వైద్యసంవర్ధ్దక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు టీకాలకార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెం పుడు కుక్కల ఆరోగ్యం పరిశుభ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, అల్లారు ముద్దుగా పెంచడమే కాకుండా వాటి పరిశుభ్రత తప్పకుండా పాటించాలని సూచించారు. కుక్కలకు రేబీస్ టీకాలు వేయడం ద్వారా వాటి నుంచి మనుషులకు ఇతర జంతువులకు వ్యాధి సోకకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పెంపుడు కుక్కలకు రేబీస్ టీకాలను వేయించాలన్నారు.
సంగారెడ్డిలోని పశువైద్యశాలలో సంగారెడ్డి పట్టణానికి మండలంలోని గ్రామాల నుండి టీకాలు వేసేందుకు జంతు ప్రేమికులు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, జిల్లా పశువైధ్యాధికారి వసంతకుమారి, జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, పశు వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ అరుణశ్రీ, పవన్‌కుమార్, యోగేష్, కౌన్సిలర్‌లు విష్ణువర్దన్, పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.