Sunday, December 22, 2024

విద్యార్థిని పట్ల పిఈటి అసభ్య ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల పిఈటి అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు స్కూల్‌పై దాడి చేసిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థినితో అదే పాఠశాలలో పనిచేస్తున్న పిఈటి మాస్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. గత కొంత కాలం నుంచి విద్యార్థినికి ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు.

ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంధువులతో కలిసి పాఠశాలకు వచ్చి పిఈటి కోసం వెతకగా అప్పటికే పారిపోయాడు. ఆగ్రహం చెందిన వారు ఫర్నిచర్, కంప్యూటర్ రూమ్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై దాడి చేశారు. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News