Monday, February 24, 2025

కుమారుడిని చంపిన సవతి తల్లి

- Advertisement -
- Advertisement -

2 Injured in Car Accident at Jubilee Hills Check Post

హైదరాబాద్: సవతి తల్లి కుమారుడిని భవనం పైనుంచి తోసేసి అనంతరం గొంతు నులిమి హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లో నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భాస్కర్- సరిత అనే దంపతులు గోల్నాకలో జీవనం సాగిస్తున్నారు. మొదటి భార్య కుమారుడు ఉజ్వల్ వారితోనే ఉంటున్నాడు. పది రోజుల క్రితం ఉజ్వల్ భవనంపైనుంచి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి చికిత్స పొందిన తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. శనివారం ఉజ్వల్ సవతి తల్లి ఉజ్వల్ గొంతు నులిమి చంపేసింది. బాలుడి మృతిపై అనుమానం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సవతి తల్లి సరితను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని తెలిపింది. తొలుత భవనం పైనుంచి తోసేసినా చావకపోవడంతో గొంతు నులిమి చంపానని ఒప్పుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News