Sunday, December 22, 2024

విద్యార్థినిపై పిఇటి లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

ఆదిభట్ల ః ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థినిపై పిఇటి లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈమేరకు బాలిక తండ్రి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థినిని ప్రకాశ్ అనే పిఇటి గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ఫోన్ చేసి మరీ వేధిస్తున్నట్లు బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News