Saturday, December 21, 2024

విద్యార్థినిపై పిఇటి లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

సిర్గాపూర్/సంగారెడి/ నారాయణ ఖేడ్ : సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన సిర్గాపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫిజికల్ డైరెక్టర్ సంగ్రాంతో పాటు మరో ఉపాధ్యాయున్ని శుక్రవారం గ్రామస్తులు చితకబాధి పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న డిఈఓ వెంకటేశ్వర్లు, సీఐ రాజశేఖర్‌లు బాధిత విద్యార్థిని బంధువులతో పాటు పాఠశాల సిబ్బందితో విచారణ జరిపారు. వెంటనే సంగ్రాం ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు.
ఇరువురిపై కేసు నమోదు: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీతోపాటు హెచ్‌ఎంను సైతం చితకబాదారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిర్గాపూర్ ఎస్‌ఐ నారాయణ తెలిపారు.
సిర్గాపూర్ జడ్‌పిహెచ్‌ఎస్ పిఇటి హెచ్‌ఎంల సస్పెండ్
సిర్గాపూర్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లోపదవతరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన పిఇటి సంగ్రామ్, ఆయనకు సహకరించిన పాఠవాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్‌ను సస్పెండ్ చేశామని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News