Sunday, February 23, 2025

సారూ, కారూ రెడీ.. రూటు ఎటు?

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ బయటికి వచ్చారు.. పలు
విషయాలు మాట్లాడారు సంతోషమే. కానీ ఒకటి రెండు అసలు విషయాలలో స్పష్టత రాకపోతే ఏం ప్రయోజనం అంటూ భారత రాష్ట్ర సమితిలో నాయకులే కొందరు
బయటకు వచ్చిన తర్వాత గుసగుసలు పోవడం వినిపించింది. అందులో మొదటిది.. మనం ఇంకా భారత రాష్ట్ర సమితిగానే ఉండి జాతీయ పార్టీ అని చెప్పుకుంటామా? లేక పేరు మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటామా అన్నదే అర్థం కావడం లేదు అన్నారు వారు. ఇది నిజంగా భారత రాష్ట్ర సమితి పార్టీ, దాని అధినాయకుడు కేసీఆర్ సీరియస్ గా
ఆలోచించుకోవాల్సిన విషయం.

నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటే తప్ప ఆ రాజకీయ పార్టీ అస్తిత్వానికి భరోసా ఉండదు. ఈ మూడున్నర సంవత్సరాల కాలం కేసీఆర్ తన పార్టీని ఎలా నడిపిస్తారనే దాని మీద ఆధారపడి ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. కొన్ని చిక్కులు, సవాళ్లు.. వాటిని అధిగమించడానికి వేయవలసిన ఎత్తులు కెసిఆర్ వంటి నాయకుడికి ఎవరూ చెప్పవలసిన పనిలేదు.

ఇప్పుడు కెసిఆర్ నిర్వహించబోతున్నది ఏ పార్టీ రజతోత్సవాలు? బిఆర్‌ఎస్ గానే కొనసాగేటట్లయితే అది ఏర్పడి అయిదారు సంవత్సరాలు కూడా కాలేదు. రజతోత్సవాలు జరగాల్సింది 2001లో జలదృశ్యంలో ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి. కాబట్టి ఈ సంబరాలు మొదలుపెట్టే ముందే పార్టీ పేరు మార్చుకొని మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల ముందుకు వస్తారా? లేకపోతే
బిఆర్‌ఎస్ కే రజతోత్సవాలు
జరుపుతున్నామని ముందుకుపోతారా? లోకేష్ ముఖ్యమంత్రి
కాబోతున్నారు అని చంద్రబా బు సమక్షంలోనే దావోస్ సభల
సందర్భంగా జరిగి న తెలుగుదేశం అభిమానుల సభలో ఒక అత్యు త్సాహవంతుడు ప్రకటించిన విషయం బహుశా పవన్ కళ్యాణ్ చెవులకు కూడా సోకి ఉంటుంది. ఆ నోటా ఈనోటా ఈ వ్యవహారమంతా మోదీ దాకా చేరిందేమో? అందుకే హెచ్చరికగా ఆయన పవన్ కళ్యాణ్ కు మీరు ఇప్పుడు ప్రజల కోసం పని చేయాలని చెప్పి ఉండవచ్చు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శాసనసభకు హాజరయ్యేట్టు చూసేందుకు అసెంబ్లీ స్పీకర్‌కు, స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఒకాయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సభ్యుడిని శాసనసభకు రప్పించడం ఎవరివల్లా అయ్యే పనికాదు. అసెంబ్లీ స్పీకర్ అయినా, న్యాయస్థానాలైనా అసెంబ్లీ రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్లవలసి ఉంటుంది. నిర్ణీత సమయం వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోయే విధంగా కూడా అసెంబ్లీ రూల్స్ ఉంటాయి. శాసనసభలు, అక్కడి అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉందని ఆ పిటిషన్ దాఖలు చేసిన పెద్దమనిషి పేర్కొన్నారు. కావచ్చు, కానీ ‘ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను శాసనసభకు వెళ్లను’ అని భీష్మించుకునేవారిని బలవంతంగా శాసనసభకు తీసుకెళ్లలేరు.

సరే, దానిమీద కోర్టు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందో తేలేలోగా ‘శాసనసభ ఏం ఖర్మ, కనీసం జనంలోకి కూడా రావడంలేదు కెసిఆర్’ అని ఈ గత పదమూడు నెలలుగా అనుకుంటున్న వాళ్లందరి మాటల్ని విన్నారో ఏమో మొన్న కెసిఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరై నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సుదీర్ఘంగా ఉపన్యసించి అనేక అంశాల్ని తడిమారాయన తన ప్రసంగంలో. ‘ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన పార్టీ అంతరించిపోదు, నూరు శాతం మనమే గెలుస్తాం మళ్లీ. పార్టీ ఫిరాయించిన పదిమంది సభ్యుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అవన్నీ కూడా మనమే గెలుస్తాం’ అని చెప్పారు. కింది శ్రేణి నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన ప్రసంగం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. క్యాడర్‌ను ఆకర్షించేందుకు అద్భుతమైన ప్రసంగాలు చేయడంలో కెసిఆర్ దిట్ట. చక్కటి వాగ్ధాటి కలిగిన అతికొద్దిమంది రాజకీయ నాయకులలో కెసిఆర్ కూడా ఒకరు. ఆయన ప్రసంగానికి వంక పెట్టడానికి ఏమీ ఉండదు.

సరే ఆయన బయటకు వచ్చారు ఇక బయటనే ఉంటారా, శ్రేణులను ఉత్సాపరిచేందుకు ప్రజా సమస్యలను తీసుకొని జనంలోకి వెళతారా అన్నది ఇప్పటికింకా మిలియన్ డాలర్ల ప్రశ్నే.బాస్ బయటికి వచ్చారు.. పలు విషయాలు మాట్లాడారు సంతోషమే. కానీ ఒకటి రెండు అసలు విషయాలలో స్పష్టత రాకపోతే ఏం ప్రయోజనం అంటూ భారత రాష్ట్ర సమితిలో నాయకులే కొందరు బయటకు వచ్చిన తర్వాత గుసగుసలు పోవడం వినిపించింది.మనం ఇంకా భారత రాష్ట్ర సమితిగానే ఉండి జాతీయ పార్టీ అని చెప్పుకుంటామా? లేక పేరు మార్చుకొని తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటామా అన్నదే అర్థం కావడం లేదు అన్నారు వారు. ఇది నిజంగా భారత రాష్ట్ర సమితి పార్టీ, దాని అధినాయకుడు కెసిఆర్ సీరియస్‌గా ఆలోచించుకోవాల్సిన విషయం.’

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా రెండు జాతీయ రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోనే అధికారంలో ఉంటే మరొకటి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ. నాది మూడవ జాతీయ పార్టీ అని బిఆర్‌ఎస్ చెప్పుకుంటే వచ్చే అదనపు ప్రయోజనం ప్రజల్లో ఏమీ ఉండకపోవచ్చు. నిజానికి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాతనే ఆ పార్టీ ప్రభ తగ్గిపోయింది అన్నది అక్షరసత్యం. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు చెరిసగం సీట్లు కొట్టుకుపోవడం, బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడం ఇక్కడ గమనార్హం. కెసిఆర్ ప్రాంతీయ నాయకుడిగా ప్రసిద్ధుడు. మేము జాతీయ రాజకీయాలు ఎందుకు చేయకూడదు అని అంటే ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు ఇంకా అదే నినాదాన్ని పట్టుకొని వేళ్ళాడితే ప్రయోజనం ఉండదన్న విషయం అంత అనుభవశాలి అయినా కెసిఆర్‌కు ఎవరైనా చెప్పాలా?

మొన్నటి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే కెసిఆర్ ఇప్పుడు జాతీయబాట వదిలి మళ్లీ ప్రాంతీయ మార్గానికి వెళ్లాల్సిన అవసరాన్ని ఆయనే చెప్పకనే చెప్పారని అనిపిస్తుంది మనకు. అదేమిటంటే ‘చంద్రబాబు ఎన్‌డిఎ పేరిట తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టాలనుకుంటున్నారు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికాకూడదు. అదే జరిగితే రాష్ట్రం ఆగమయ్యే ప్రమాదం ఉంటుంది’ అని చెప్పారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలంగాణ మీద కన్ను లేదని ఎవరూ అనుకోరు. అయితే తెలంగాణలో కాలుపెట్టలేని పరిస్థితిని ఆయనే స్వయంగా కొనితెచ్చుకున్నారు. పైగా ఆయనతో కలిస్తే శంకరగిరి మాన్యాలే అన్న విషయం 2018లో కాంగ్రెస్‌కు జరిగిన పరాభవం నుంచి అందరూ తెలుసుకున్నదే. అప్పట్లో చంద్రబాబు నాయుడు తన పార్టీని కాంగ్రెస్‌తో జత చేసి తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనడానికి ముందు వరకు కెసిఆర్ అసలు ఎన్నికల ప్రచారానికే బయటికి రాలేదు. రెండవ పర్యాయం గెలుస్తామా లేదా అన్న మీమాంసలో ఉండిపోయిన స్థితి.

ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నదనే వార్త వచ్చిందో కెసిఆర్ జూలు విదిలించి బయటకొచ్చి మళ్లీ తెలంగాణ పరాయికరణ జరగబోతున్నదనే నినాదాన్ని తీసుకొని రెండవసారి గెలిచిన విషయం తెలిసిందే. ఆనాడు కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఈ విషయం బిజెపి నాయకత్వానికి.. అందునా నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి కరడుగట్టిన రాజకీయ నాయకులకు అర్థం కాకుండా ఉంటుందా? 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందన్న ఆశలు చిగురుస్తున్నవేళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అనే మోత బరువును ఎందుకు తెచ్చుకుంటుంది? కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణకొచ్చి ఏదో చేయబోతున్నారు, తెలంగాణ మళ్లీ పరాయీకరణకు గురవుతుంది అన్న అంశాన్ని తీసుకొని ఎన్నికలకు వెళ్లే అవకాశం కెసిఆర్‌కు ఉండకపోవచ్చు.2023 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దాదాపుగా తొలిసారి బయటకు వచ్చి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు కాబట్టి కెసిఆర్ చెప్పవలసిన విషయాలు, స్పష్టత ఇవ్వవలసిన అంశాలు ఇంకా చాలానే ఉండొచ్చు. ఎందుకంటే ఓటమి తర్వాత బిఆర్‌ఎస్ గురించి జరిగిన ప్రచారం,

పార్టీ పని అయిపోయిందంటూ బిఆర్‌ఎస్ నేతలే ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం ఇక్కడ ప్రస్తావించాలి. నిజానికి ఒక్కసారి ఓడిపోతే ఏ పార్టీ పని అయిపోదు. మామూలు రాజకీయ పార్టీలే రెండు, మూడు పర్యాయాలు ఓడిపోయిన తర్వాత కూడా తిరిగి అధికారంలోకి వస్తుంటే టిఆర్‌ఎస్ వంటి ఉద్యమాలు పునాదిగా ఏర్పడిన పార్టీలు అంత సులభంగా అంతరించిపోవు. అయితే నాయకుడు నిత్యం ప్రజల్లో ఉంటే తప్ప ఆ రాజకీయ పార్టీ అస్తిత్వానికి భరోసా ఉండదు. ఈ మూడున్నర సంవత్సరాల కాలం కెసిఆర్ తన పార్టీని ఎలా నడిపిస్తారనే దాని మీద ఆధారపడి ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. కొన్ని చిక్కులు, సవాళ్లు.. వాటిని అధిగమించడానికి వేయవలసిన ఎత్తులు కెసిఆర్ వంటి నాయకుడికి ఎవరూ చెప్పవలసిన పనిలేదు. కెసిఆర్ పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం బయటకు వచ్చాడనో, వైద్య పరీక్షల కోసం వచ్చి అలా పార్టీ ఆఫీస్ సందర్శించి వెళ్ళాడనో చవకబారు రాజకీయ ప్రచారం చేయడంవల్ల ప్రయోజనం ఉండదు. ఏప్రిల్ 27వ తేదీన ఆయన తలపెట్టిన పార్టీ 25వ ఆవిర్భావ సభ, అది జరిగే తీరు,

ఆ తర్వాత ఒక సంవత్సర కాలంపాటు ఆ పార్టీ చేపట్టే రజతోత్సవ సంబరాలలో జరిగే కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయనే అంశం మీద ఆధారపడి ఉంటుంది.ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు కెసిఆర్ నిర్వహించ బోతున్నది ఏ పార్టీ రజతోత్సవాలు? బిఆర్‌ఎస్ గానే కొనసాగేటట్లయితే అది ఏర్పడి అయిదారు సంవత్సరాలు కూడా కాలేదు. రజతోత్సవాలు జరగాల్సింది 2001లో జలదృశ్యంలో ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి. కాబట్టి ఈ సంబరాలు మొదలుపెట్టే ముందే పార్టీ పేరు మార్చుకొని మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రజల ముందుకు వస్తారా? లేకపోతే బిఆర్‌ఎస్‌కే రజతోత్సవాలు జరుపుతున్నామని ముందుకుపోతారా? అలాపోతే అందులో ఔచిత్యం ఏం ఉంటుంది అన్నది ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఆలోచించుకోవాల్సిన విషయం.

మోడీ ఆంతర్యం అర్థమైందా పవర్ స్టార్?
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడి ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మొన్న ఢిల్లీలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆయన ఆహార్యం చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మీరు హిమాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అక్కడికి వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. మీరు ఇప్పుడు ప్రజలకోసం పనిచేయాలి’ అని చమత్కారంగా వ్యాఖ్యానించారని తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అందరినీ కలుస్తూ వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్‌ను కూడా పలకరించి కరచాలనం చేసిన ఫోటోలైతే వచ్చాయి పేపర్లలో. వారిద్దరి మధ్య సంభాషణ ఏమైనా జరిగిందా, జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగానే జరిగిందా అన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ప్రధానమంత్రి తెలుగు పత్రికలు చదవబోయేది లేదు, నేను అలా అనలేదు అని ఖండించబోయేది లేదు.

పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి నమ్మాలి అంతే. అసలు మోడీకి పవన్ కళ్యాణ్ హిమాలయాలకు వెళ్తాడని అనుమానం ఎందుకు వచ్చింది ఆ ఆహార్యాన్ని బట్టే కదా. అటువంటి దుస్తులను బిజెపిలోనే ముఖ్యుడైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ధరించే ఉంటారు. నిజానికి స్వతహాగా యోగి ఆదిత్యనాథ్ సాధువే. సాధువయుండి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువసార్లే బహుశా మోడీ ఆదిత్యనాథ్‌ను కలుస్తూ ఉండొచ్చు. యోగిని కలిసినప్పుడు రాని అనుమానం పవన్ కళ్యాణ్‌ని చూస్తే ఎందుకు వచ్చింది? ఎల్లవేళలా అదే వేషధారణలో ఉంటాడు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గురించి అటువంటి సందేహం మోడీ గారికి కలగనట్టుంది. ఎన్నడూ లేనిది కొత్తగా ఇలాంటి వేషధారణలో పవన్ కళ్యాణ్ కనిపించేసరికి ఆ అనుమానం వచ్చి ఉంటుంది. సరే, పవన్ కళ్యాణ్ హిమాలయాలకు వెళ్తారా లేదా? వెళ్లేటట్టయితే ఇంకా ఎంత సమయం ఉంది వంటి విషయాలు పక్కన పెడితే ప్రజల కోసం పనిచేయాలి అన్న విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి.

ఈ మధ్యనే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక సర్వేను వెల్లడించారు. అది మంత్రుల పనితీరుకు సంబంధించింది. సత్వరం ఫైళ్ళ పరిష్కారం విషయం లో ఏ మంత్రికి ఏ ర్యాంకు వచ్చిందో ఆ సర్వే ఫలితాలలో ప్రకటించారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆరవ ర్యాంకు, ఆయన కుమారుడు, మరో మంత్రి లోకేష్‌కు ఎనిమిదవ ర్యాంకు వస్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాత్రం పదవ ర్యాంకు లభించింది. పవన్ కళ్యాణ్‌తో సమానంగా తన కుమారుడిని కూడా ఉపముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్న చంద్రబాబు నాయుడుకుఈ సర్వే ఫలితాలు మద్దతుగా నిలుస్తాయని అక్కడక్కడ మాటలు వినిపించాయి. లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ కింది శ్రేణి నాయకులనుండి, కార్యకర్తలనుండి కొంతకాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి ఏమిటి ఏకంగా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చంద్రబాబు సమక్షంలోనే దావోస్ సభల సందర్భంగా జరిగిన తెలుగుదేశం అభిమానుల సభలో ఒక అత్యుత్సాహవంతుడు

ప్రకటించిన విషయం బహుశా పవన్ కళ్యాణ్ చెవులకు కూడా సోకి ఉంటుంది. ఆ నోటా ఈ నోటా ఈ వ్యవహారమంతా మోడీ దాకా చేరిందేమో? అందుకే హెచ్చరికగా ఆయన పవన్ కళ్యాణ్‌కు మీరు ఇప్పుడు ప్రజల కోసం పని చేయాలని చెప్పి ఉండవచ్చు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు కీలక శాఖలే దక్కాయి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అడవులు, పర్యావరణం ఈ నాలుగు శాఖల్లో కూడా నిజంగా చిత్తశుద్ధితో పని చేయాలనుకుంటే బోలెడంత అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి హెచ్చరికను స్వీకరించి పవన్ కళ్యాణ్ తన పనితీరును మెరుగుపరచుకుంటారేమో చూడాలి.

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News