Wednesday, December 25, 2024

గ్రూప్-2 వాయిదాపై హైకోర్టులో పిటిషన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం 150మంది అభ్యర్థులు గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, TSPSC వద్ద గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనకు చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ టిఎస్పిఎస్సి ముట్టడికి పిలుపునివ్వడంతో నాంపల్లిలోని టిఎస్పిఎస్సి ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. దీంతో టిఎస్పిఎస్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

టిఎస్పిఎస్ ముట్టడించేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. TSPSC చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. దీంతో గ్రూప్-2 వాయిదాపై నిర్ణయం తీసుకునేందుకు తమకు 48 గంటల సమయం ఇవ్వాలని కార్యదర్శి కోరినట్లు తెలుస్తోంది. అయితే, అభ్యర్థులు మాత్రం స్పష్టమైన హామీ ఇచ్చేంతరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News