Monday, December 23, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 11న జరిగిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు సేకరించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. హాల్ టికెట్ నెంబర్, ఫొటో లేకుండా ఒఎంఆర్ షీటు ఇచ్చారని, ఇలా ఒఎంఆర్ షీట్లు ఇవ్వడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉందని పిటిషనర్లు తెలిపారు.

ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. గ్రూప్ -1 ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబరు 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు కావడంతో.. ఈనెల 11వ తేదీన టిఎస్‌పిఎస్‌సి మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది. రాష్ట్రంలో 503 పోస్టులకు గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల కాగా, ఈనెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. ఉదయం 8.30 నుంచి 10.15 వరకు మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News