తార్నాక: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మహాంకాళి జిల్లా ఎస్సీ మోర్చా సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ఎ.శంకర్‌రావు పేర్కోన్నారు.ఈ మెరకు శంకర్‌రావు ఆద్వర్యంలో శుక్రవారం తార్నాక డివజన్ లాలాపేటలో ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం శంకర్ రావు మాట్లాడుతు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాదించుకున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎస్సీలు,ఎస్టీలపై అన్యాయాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు.సికింద్రాబాద్‌లో దళిత బందు ఎంత మందికి వచ్చిందో స్పష్టత ఇవ్వాలని కోరారు.
అర్హులకు దళిత బందు రావడం లేదని, దళిత బంధు ఎంపిక ప్రక్రియ పార్టీల పక్షపాతం లేకుండా జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో జరగాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా అర్హులైన ఎస్సీలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, డప్పు కొట్టేవారికి, చెప్పులు కుట్టే వారికి 5వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్‌రెడ్డి, వేణు యాదవ్, వెంకటేష్‌గౌడ్, ప్రకాష్‌గౌడ్, ఉపేందర్, వేణు, క్రిష్ణమూర్తి, నవీన్, శ్రీనివాస్, కరుణాకర్, శ్రవణ్, పోచయ్యయాదవ్, రామువర్మా, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.