Wednesday, January 22, 2025

కెటిఆర్ చిత్ర పటానికి వినతి పత్రం

- Advertisement -
- Advertisement -

బీబీపేట్ : మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం విద్యార్థులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ చిత్ర పటానికి వినతి పత్రం సమర్పించారు. మూడు సంవత్సరాల క్రి తం బీబీపేట బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు నూతన కళాశాల ఏర్పాటు చేసి సినిమా హీరో మహేష్ బాబుతో ప్రారంభించాలని వినతిలో పేర్కొన్నారు ఇప్పటికైనా బీబీపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడి ప్రాంత విద్యార్థుల భవిశ్యత్తు కెసిఆర్ ఇచ్చిన హామీ జూనియర్ కళాశాలపై ఆధారపడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు దుంప నర్సింలు, రాజు, కాంగ్రెస్ నాయకులు స్వామి, విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, శివ, జూనియర్ కళాశాల సాధన సమితి కన్వీనర్ దేవరాజ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News