Monday, December 23, 2024

బండి సంజయ్ అరెస్టు పై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కీరంనగర్ ఎంపి బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. బండి సంజయ్‌ను కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించవలసిందిగా పిటిషనర్ సురేందర్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈ కేసు విచారణ గురువారం వచ్చే అవకాశం ఉంది.
కారణాలు చెప్పకుండా బండి సంజయ్‌ను మంగళవారం రాత్రి చట్ట విరుద్ధంగా అరెస్టు చేసినట్లు పిటిషనర్ ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడైన సంజయ్‌ను మందుగా నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం కుదరదని పిటిషనర్ తెలిపారు.

సిఆర్‌పిసిలోని సెక్షన్ 50 కింద క వ్యక్తిని అరెస్టు చేసినపుడు ఆ వ్యక్తి కుటుంబానికి తెలియ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ వాదించారు.తన అత్తగారి దశదిన కార్యక్రమం కోసం అక్కడకు వెళ్లినపుడు పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టుకు గల కారణాలను సంజయ్ కుటుంబానికి పోలీసులు తెలియచేయలేదని, బందులు కూడా తీసుకోనివ్వలేదని ఆయన ఆరోపించారు. తన పిటిషన్‌లో ప్రతివాదులుగా హోం శాఖ సెక్రటరీ, డిజిపి, కరీంనగర్, రాచకొండ పోలీసు కమిషనర్లు, బొమ్మల రామారం సిఐలను పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News