Tuesday, January 21, 2025

దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీపై గెలుపొందిన దానం నాగేందర్ ఖైరతా బాద్ ఎంఎల్‌ఎగా కొనసాగుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా బరి లో ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఎంఎల్‌ఎగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపిగా పోటీ చేయడం చట్ట పరంగా రాజ్యాం గ విరుద్దమని పిటిషనర్ అన్నారు. దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దానంపై అనర్హత వేటు వేయా ల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ను కోరారు. కాగా దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్ పార్టీ సైతం ఇప్పటికే ఈ విషయమై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం కెటిఆర్ సైతం ఈ విషయమై స్పందించారు.

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా దానంను ప్రకటించడంతో ఆయనను స్పీకర్ అనర్హుడిగా గుర్తించాలని కోరారు. ఈ విషయమై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవా లన్నారు. రాజకీయ ఒత్తిడితో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. మరికొన్ని నెలల్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ఇదిలా ఉండ గా దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News