- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో గురువారం నాడు పిటిషన్ దాఖలైంది. ప్రమోట్ అయి న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దంటూ తల్లి దండ్రుల సంఘం ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. తల్లి దండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ వేశారు. లేకుండా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ అయిన విద్యార్థు లకు మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. కరోనా కారణంగా మే నెలలో జరగాల్సిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సం వత్సరం పరీక్షలను నిర్వహించలేదు. ఇంటర్ ద్వితీ య విద్యార్థులకు తొలి ఏడాదిలో వచ్చిన మార్కులనే కేటాయించి ఇటీవల ఫలితాలు కూడా వెల్లడించా రు. ప్రథమ ఏడాది విద్యార్థులను మాత్రం రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేశారు.
- Advertisement -