Sunday, December 22, 2024

ఉద్యోగుల అవినీతి చర్యలపై పాండురంగనాయక్‌కు వినతి పత్రం

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: రాష్ట్ర ఆర్టీఏ ఆఫీస్‌లో ఉద్యోగుల అక్రమాలు, అవినీతి చర్యలతో శాఖకే మచ్చ తీసుకొస్తున్నారని హైదరాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ కోరారు. ఉద్యోగులు మహమ్మద్ గౌస్, వెంకటరమణలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని, వీరిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా నేటికి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ యన ఆర్టీఏ జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్‌కు ఆయన వినతి పత్రం ఇచ్చారు. దీపం ఉండగానే ఇళ్లను చక్కదిద్దే పనుల్లో వారు పూర్తిగా మునిగిపోయారని, వీరి వల్ల ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఇద్దరు అక్రమార్కులపై వెంటనే కఠిన చర్యలతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంలో మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో తాము తీవ్రంగా పరిగణించి, వెంటనే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని ముజీబ్ హుస్సేనీ హెచ్చరించారు. ఉ ద్యోగులు అక్రమార్కులపై ప్రస్తావించిన సమస్యలపై జేసీ స్పందించారు. సంస్థల్లో ఎలాంటి అవినీతి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా టీఎన్జీవో కార్యదర్శి విక్రంకుమార్, అసోసియోట్ అధ్యక్షుడు కెఆర్ రాజకుమార్, నాయకులు కురాడి శ్రీనివాస్, ఖాళేద్ అహ్మద్, వైదిక్ శాస్త్ర, శంకర్, ముఖీం, శ్రీధర్, ఆర్టీఏ యూనిట్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అరుణేందర్, కార్యదర్శి పవన్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News