- Advertisement -
అత్యవసరంగా విచారించలేమని తొసిపుచ్చిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో దళిత బంధు పథకంపై శుక్రవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దళిత బంధు కోసం ప్రభుత్వం రూ. 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్‌ను పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర నరేష్ దాఖలు చేశారు. ఈక్రమంలో అత్యవసర అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చడంతో పాటు గతంలో కూడా ఇదే అంశంపై పిటిషన్ వేశారని హైకోర్టు వెల్లడించింది. దళితబంధు పథకంపై అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు తెలిపింది.
- Advertisement -