Wednesday, January 22, 2025

బుల్డోజర్ రాజకీయాలు : సుప్రీంలో పిటిషన్

- Advertisement -
- Advertisement -

Petition on Violent crime in SC

న్యూఢిల్లీ : హింసాత్మక నేరాల వంటి సంఘటనలకు పాల్పడినట్టు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ సంస్థ జమియత్ ఉలమాఎహింద్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుల్డోజర్లతో భయంకర రాజకీయాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆ సంస్థ క్రిమినల్ ప్రొసీడింగ్ సమయం లోనే నిందితులపై ముందస్తు చర్యలు తీసుకోవడం, వారిని శిక్షార్హంగా పరిగణించడం, నివాసాలను కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టకుండా భారత ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. ఈ విషయమై జమియత్ ఉలమా ఎహింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని ట్విటర్ ద్వారా స్పందిస్తూ నేరారోపణల పేరుతో మైనార్టీలపై ముఖ్యంగా ముస్లింలపై బీజేపీ అధికార రాష్ట్రాలు విధ్వంసానికి విద్వేషానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News