Sunday, January 19, 2025

అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంగళవారం అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటిఆర్ తమ పార్టీ శ్రేణులకు ఆదేశించారు. నియోజకవర్గాల వారిగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని  సూచించారు. లగచర్ల రైతులపై కేసులకు నిరసనగా వినతి పత్రాలు అందజేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు నిరసనగా వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన తెలియజేశారు.

బిజెపి ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (చిట్టి) కాళ్ళ బేరాలుసాగాయని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. తన ఎఫ్ బి ఖాతాలో కెటిఆర్ పోస్టు చేశారు. జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. 30 సార్లు ఢిల్లీకి పోయి మూడు పైసలు తీసుకరాలేదని కానీ మూడు కేసులు పెట్టి శునకానందం పొందుతున్నావని, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఖర్మకే వదిలేస్తున్నామని చురకలంటించారు. గుడ్ లక్ చిట్టి అని, మిమ్మల్ని చట్టపరంగా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని కెటిఆర్ సవాల్ విసిరారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News