Wednesday, January 22, 2025

అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించేలా చూడాలంటూ పిటిషన్

- Advertisement -
- Advertisement -
Petition seeking disclosure of candidates criminal history
ఎన్నికలకు ముందే పరిశీలించనున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కారణాలతో పాటుగా వారి క్రిమినల్ కేసుల వివరాలను కూడా తమ వెబ్‌సైట్లలో ప్రచురించేలా చూసే విధంగా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను విచారణ కోసం లిస్టింగ్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బొపన్న, హిమా కోహ్లీతో కూడిన ధరాసనాన్ని కోరారు. వ్యక్తిగత హోదాలో ఉపాధ్యాయ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేశారు. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి ఇచ్చిన రెండు తీర్పులను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఉపాధ్యాయ్ అన్నారు. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని, పిటిషన్‌ను విచారించే తేదీని చెబుతానని ఈ దశలో చీఫ్ జస్టిస్ రమణ ఆయనతో అన్నారు. రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించడంతో పాటుగా ప్రతి రాజకీయ నాయకుడు ఈ వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో ప్రచురించేలా చూసే విధంగా ఎన్నికల కమిషన్‌కు ఆదేవాలు ఇవ్వాలని, ఒక వేళ ఆ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత పార్టీ అధ్యక్షుడిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని కూడాఆ పిల్‌లో కోరారు.

గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్ పార్టీ అయిన సమాజ్‌వాది పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంనుంచి గ్యాంగ్‌స్టర్ నహీద్ హసన్‌ను అభ్యర్థిగా ప్రకటించిందని, సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వుల స్ఫూర్తితో అభ్యర్థి నేర చరిత్ర వివరాలను కానీ, అతడిని అభ్యర్థిగా ఎంపిక చేయడానికి కారణాలను కానీ అతను కానీ, పార్టీ కానీ 48 గంటల్లోగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రచురించలేదని, అందుకే ఈ పిటిషన్‌ను దాఖలు చేయాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.దాదాపు 11 నెలల క్రితం నహీద్ హసన్ గ్యాంగ్‌స్టర్ చట్టంకింద అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్నాడని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో నామినేషన్ వేసిన తొలి అభ్యర్థి అతనేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. అతనిపై అనేక కేసులున్నాయని, ప్రత్యేక ఎంఎల్‌ఎఎంపి కోర్టు అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించిందని కూడా పిల్‌లో ఆరోపించారు. చట్ట సభల ప్రతినిధులుగా ఎన్నిక కావడం కోసం నేర చరితులు పోటీ చేయడానికి అనుమతించడం వల్ల ప్రజాస్వామ్యానికి, లౌకిక వాదానికి తీవ్ర పరిణామాలు ఎదురవుతుఆయని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News