Wednesday, January 22, 2025

పన్నులు తగ్గించాలని మంత్రి హరీశ్‌రావుకు వినతి పత్రం

- Advertisement -
- Advertisement -

చేర్యాల: సిద్దిపేట జిల్లాలోని  చేర్యాల మున్సిపాలిటీలో అధికంగా ఉన్న ఇంటి పన్నులను తగ్గించాలని కోరుతూ మున్సిపల్ పాలకవర్గం ఆద్వర్యంలో బుధవారం మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న 0.25 ఉన్న ఇంటి పన్నును కనీసపన్నును 0.125గా తగ్గించాలని మంత్రి హరీశ్‌రావను కోరడం జరిగిందన్నారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి సిడిఎంఏ కార్యాలయంనకు అదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి పక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి జేఏసి అనే ముసుగులో పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కౌన్సిలర్లు నిత్యం ప్రజల కోరకు ప్రాంత అభివృద్ది కోసం పని చేసే వారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కౌన్సిలర్లు మంగోల్ చంటి, ఆడేపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్ ,నాయకులు అంకుగారి శ్రీదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News