Saturday, December 28, 2024

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో జగన్, విజయసాయి రెడ్డి పిటిషన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యూకే పర్యటనకు అనుమతించాలని కోరుతూ ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లిపోవద్దనే షరతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన యూకే పర్యటనకు అనుమతి కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు.

తనకు దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరారు. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు సిబిఐ సమయం కోరింది. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. మరోవైపు యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్, సింగపూర్ తదితర విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ ఎంపి విజయ సాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News