Friday, January 24, 2025

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel Hike for 7th time in 8 days

న్యూఢిల్లీ: దేశంలో ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 90 పైసలు, డీజిల్‌పై 76 పైసల చొప్పున మంగళవారం ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100.21, డీజిల్ ధ‌ర రూ.91.47కి చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.115.04, డీజిల్ రూ.99.25గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధ‌ర రూ.113.61 చేరుకోగా, డీజిల్ ధ‌ర రూ.99.83గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటరు పెట్రోల్ ధర రూ.115.37, డీజిల్ రూ.101.23గా ఉంది. స్థానిక పన్నులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండడంతో డీజిల్, పెట్రోల్ ధరలు వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉన్నాయి. నాలుగున్నర నెలల విరామం అనంతరం మార్చి 22 నుంచి పెట్రల్, డీజిల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. దీంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Petrol and Diesel Hike for 7th time in 8 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News