Friday, November 15, 2024

రెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel price hiked for 2nd straight day

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం రెండో రోజూ పెరిగాయి. రెండు వారాల విరామం తరువాత పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ వ్యాపారులు రోజు వారీ ధరల సవరింపు తిరిగి ప్రారంభించారు. పెట్రోలు లీటరు ధర 19 పైసలు వంతున, డీజిల్ లీటరు ధర 21 పైసల వంతున ధరలు పెరిగాయి. మంగళవారం పెట్రోలు లీటరు 15 పైసలు, డీజిల్ లీటరు 18 పైసల వంతున ధరలు పెరగ్గా మళ్లీ బుధవారం మరింత పెరిగాయి. బలహీన పడిన డాలరు విలువ తిరిగి పుంజుకోవడం కోసం అమెరికా డిమాండ్ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలుపుకుని పెట్రోలు రీటైల్ ధరపై 60 శాతం, డీజిల్ ధరపై 54 శాతం అదనపు భారం పడింది. కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.32.90 వంతున, డీజిల్ పై రూ. 31.80 వంతున ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.97.12కు, లీటరు డీజిల్ ధర రూ. 88.19 కు పెరిగాయి.

Petrol and Diesel price hiked for 2nd straight day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News