Thursday, January 9, 2025

పెట్రోల్, డీజిల్ ధర రూ.2 తగ్గింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను లీటర్‌కు రూ 2 మేర తగ్గించారు.శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఈ తగ్గింపు అమలులోకి వస్తుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఇంధన ధరల తగ్గింపు ప్రకటన చేసింది. ప్రధాని మోడీ గతవారం వంటగ్యాసు ధరలను సిలిండర్‌కు రూ 100 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోలు డీజిల్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సామాజిక మాధ్యమాల ద్వారా గురువారం సాయంత్రం తెలియచేశారు.

దేశంలోని కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం సౌలభ్యం తమ లక్షం అని చెపుతున్న ప్రధాని మోడీ ఈ తగ్గింపు ద్వారా మరోసారి తన మాట నిలబెట్టుకున్నారని స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయి చమురు సంక్షోభం ఉన్నప్పటికీ గత రెండున్నర సంవత్సరాలుగా దేశంలో పెట్రోలు ధరలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. సగటున చూస్తే ఇప్పుడు పెట్రోలు ధర లీటరుకు రూ 94గా, డీజిల్ ధర లీటర్‌కు రూ 87గా ఉందని మంత్రి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News