- Advertisement -
న్యూఢిల్లీ: ఈ వారంలో నాలుగవ సారి ధరల పెంపుతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 25 పైసల చొప్పున పెరిగినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ రూ. 75.88, ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 92.28కు చేరుకుంది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 75.88కు, ముంబయిలో రూ. 82.66కు చేరుకుంది. చమురు ధరలు పెరగడం వరుసగా ఇది రెండవరోజు. ఈ వారంలో ఇది నాలుగవసారి. స్థానిక పన్నులు లేదా వ్యాట్ ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి ఎక్సయిజ్ సుంకంపై కోత విధించాలన్న డిమాండు తీవ్రతరమవుతోంది.
- Advertisement -