హైదరాబాద్: వరుసగా 12వ రోజు పెట్రోల్ ధర పెరగింది. దీంతో తెలంగాణలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. కేంద్ర ప్రభుత్వ విధిస్తున్న ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్రాలు విధిస్తున్న ట్యాక్స్ లతో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేకున్నా, దేశీయ కంపెనీలు మరోమారు వినియోగదారులపై భారం మోపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 39 పైసలు, లీటర్ డీజిల్ పై 37 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.98కి చేరగా, డీజిల్ రూ.81కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ పై 38 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.97 చేరింది. డీజిల్ పై 39 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.87కు చేరుకుంది. ఇక, హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ లపై 40 పైసల చొప్పున పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.94.18కు, లీటర్ డీజిల్ ధర రూ.88.31కు పెరిగింది. కాగా, ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర వంద దాటి పరుగులు పెడుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కేంద్రం ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు ఆందోళనలు, రాస్తారోకోలు చేపడుతున్నాయి.
Petrol and Diesel prices hiked for 12th straight day