న్యూఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర ఈ రోజు లీటరుకు 98.11 రూపాయలు, రూ .88.65 గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.96కు చేరగా, డీజిల్ రూ.96.63కు పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.104.31, డీజిల్ రూ.98.38గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.104 దాటింది. లీటర్ పెట్రోల్ ధర రూ.10.22కు పెరగ్గా.. డీజిల్ రూ.96.16కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ.101.96కు పెరిగింది. మే 4 తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31 సారి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.79, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. దీంతో ప్రజలపై అధిక భారం పడింది. ధరలు పెరగడంతో వాహనదారులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Petrol And Diesel Prices increased Today