Thursday, November 21, 2024

వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol And diesel prices rise for sixth day

హైదరాబాద్: పెట్రోల్ ధరలను చమురు సంస్థలు వరసగా ఆరో రోజు పెంచాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి. ఈ నెలలో పెట్రో ధరలు పెరగడం 8వసారి. చమురు సంస్థలు తాగాజా లీటర్ పెట్రోల్, డీజిల్ పై 20 నుంచి 34 పైసల వరకు పెంచాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.92.26, డీజిల్ రూ.86.23కి చేరింది. వరంగల్ లో లీటర్ పెట్రోల్ రూ. 91.71, డీజిల్ రూ.85.64గా నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 32 పైసలు పెరిగి, రూ. 88.73, డీజిల్ రూ.79.06కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.95.21, డీజిల్ రూ.86.04గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండడంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Petrol And diesel prices rise for sixth day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News