న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక రోజు స్థిరంగా ఉన్న తరువాత, పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు గురువారం పెంచారు. దీంతో పెట్రోధరలు దేశవ్యాప్తంగా తాజా రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర 24 పైసలు పెరగగా, డీజిల్ ధర 29 పైసలు పెరిగింది. తాజా ధరల సవరణ తరువాత, ఢిల్లీలో పెట్రోల్ ఇప్పుడు లీటరుకు 93.68 రూపాయలకు రిటైల్ అవుతుండగా, డీజిల్ 84.61 రూపాయలకు అమ్ముడవుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో, పెట్రోల్ ధర రూ.100 మార్కుకు చేరుకుంది. ఇప్పుడు రూ .99.94 వద్ద ఉంది, డీజిల్ ధర రూ.91.87 గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో లభించిన డేటా చూపించింది. ఈ నెలలో ఇటీవల పెరగడంతో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రూ .100 దాటాయి. ఈ నెల ప్రారంభంలో, భోపాల్ మూడు అంకెలు దాటిన మొదటి రాష్ట్ర రాజధానిగా నిలిచింది. పెట్రోల్ ధర లీటరుకు 100.17 రూపాయలకు చేరుకోవడంతో నేడు జైపూర్ చారిత్రాత్మక మైలురాయిని దాటింది.
Petrol and diesel prices touch fresh record highs