Monday, November 18, 2024

తగ్గిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో రుతుపవనాలు ఆగమనం, కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడటంతో జూన్ మొదటిభాగంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు తగ్గాయి. వ్యవసాయ రంగంలో డిమాండ్ తగ్గడం, వాహనాల రాకపోకలు పరిమితం కావడంతో క్రమేపీ పెట్రోలు డీజిల్ వాడకాలు క్షీణిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత పరిశ్రమల ప్రాధమిక గణాంకాలతో ఈ విషయం నిర్థారించారు. డీజిల్ వాడకంలో దాదాపు రెండు నుంచి ఐదుశాతం వరకూ వాడకం తగ్గింది. ఈ నెల తొలి పక్షం రోజులలో డీజిల్ వాడకపు స్థాయి 3.43 మిలియన్ టన్నుల వరకూ తగ్గింది.

గత ఏడాది ఇదే నెల ఇదే సమయంలో నమోదు అయిన విక్రయాలను లెక్కల్లోకి తీసుకుని ఇప్పుడు తాజా వాడకాల లెక్కలు తేల్చారు. గత నెలలో డీజిల్ వాడకం ఏకంగా దాదాపు 7 శాతం వరకూ పెరిగింది. ఇక పెట్రోలు వాడకం ఈ నెలలో ఈ పదిహేను రోజులలో 5.7 శాతం మేరపడిపొయ్యాయి. 1 15 తేదీల మధ్యలో 1.3 మిలియన్ టన్నుల పెట్రోలు అమ్మకాలు తగ్గాయి. ఈ నెల 1 నుంచి 15వరకూ వంటగ్యాసు అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 1.3 శాతం మేర తగ్గాయని ప్రాధమిక గణాంకాలతో స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News