Wednesday, January 22, 2025

ఇక ఇంటి వద్దకే ఇంధనం!

- Advertisement -
- Advertisement -

Go Fuel India

హైదరాబాద్: ‘గోఫ్యూయెల్‌ ఇండియా’ అనే సంస్థ ఇంటి వద్దకే డీజిల్, పెట్రోల్‌ను సరఫరా చేయనున్నాయి. శుక్రవారం గోఫ్యూయెల్‌ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీ భాగస్వాములైన హెచ్‌పీసీఎల్‌ సీజీఎం హరిప్రసాద్‌ సింగు పల్లి, సుస్మిత ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి తమ కార్యకలాపాలను ఆవిష్కరించారు.

సంస్థ కోఫౌండర్‌ ఆదిత్య మీసాల మాట్లా డుతూ… ఇప్పటికే ఈ సేవలు చెన్నైలో అందుబాటులోకి వచ్చాయన్నారు. విని యోగదారులు యాప్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంధనాన్ని వారు కోరుకున్న చోటికి అందిస్తామని తెలిపారు. జూలై–సెప్టెంబర్‌లో గువాహతి, సేలంలో కార్యకలాపాలను ప్రారంభిస్తామని, 2024 నాటికి దేశమంతటా 1,000 వాహనాలతో విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు, ఆసుపత్రులు, మాల్స్, బ్యాంకులు, గిడ్డంగులు తదితర స్థలాలకూ సరఫరా చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News