- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో పెట్రోల్ ధరలు వరసగా నాలుగో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 88.14 పైసలు, లీటర్ డీజిల్ ధర 78 రూపాయాలకు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 91.65లకు చేరింది. డీజిల్ ధర 85.50 పైసలకు ఎగబాకింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 94.64 ఉండగా, డీజిల్ 81.96గా ఉంది. 2017 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా రోజువారీ ధరలలో హెచ్చుతగ్గులను పెట్రోలియం మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. కొంతకాలంగా ప్రతి వారంలో మూడు నుంచి నాలుగు రోజులకు ధరలను పెంచుతోంది.
Petrol Diesel Price hiked for fourth straight day
- Advertisement -