Thursday, November 21, 2024

వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol-Diesel Prices Hiked For 5th Consecutive Day

న్యూఢిల్లీ : వరుసగా ఐదో రోజు ఆదివారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 35 పైసల వంతున ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు 107.59 కి చేరగా, ముంబైలో రూ. 113.46 కు చేరింది. ముంబైలో డీజిలుధర లీటరుకు రూ. 104.38 కి పెరిగింది. ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు రూ. 96..32 గా ఉంది. దేశం లోని అన్ని ప్రధాన నగరాలో ్ల పెట్రోలు లీటరు ధర రూ. 100 మార్కును దాటి పోయింది. డీజిల్ కూడా దాదాపు అదే స్థాయిలో పెరుగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డీజిల్ ధర ఈ స్థాయిని చేరుకుంది. జమ్ముకశ్మీర్ నుంచి తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఆదివారం డీజిల్‌ధర ఒకటిన్నర శాతం పెరిగింది. పశ్చిమబెంగాల్ లోని పురూలియా, క్రిష్ణానగర్, బహరాంపూర్, కూచ్‌బిహార్ జిల్లాల్లో డీజిల్ ధర రూ. 100 మార్కును దాటింది. స్థానిక పన్నుల వల్ల రాష్ట్రాల్లో ఈ ధరల్లో తేడా కనిపిస్తోంది. సెప్టెంబర్ 29 నుంచి పెట్రోలు ధరలు 21 సార్లు పెరిగాయి. లీటరుకు రూ. 84 వంతున అదనంగా పెరగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.70 వంతున అదనంగా 24 సార్లు ధరలు పెరిగాయి. అంతకు ముందు పెట్రోలు ధరలు మే 4 నుంచి జులై 17 లోగా లీటరుకు రూ. 11.44 వంతున పెరగ్గా, అదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 9.14 వంతున పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News