Friday, November 22, 2024

ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ కొట్టిస్తే నీళ్లు వస్తున్నాయి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి శేరిగుడాలోని పెట్రోల్ బంక్‌లో నకిలీ పెట్రోల్ భాగోతం వెలుగుచూసింది. వాహనదారులు పెట్రోల్ పోసుకొని ఒక కిలోమీటర్ వెళ్ళగానే దాదాపు 20 వాహనాలు ఆగిపోయాయి. తీరా బాటిల్లోకి పెట్రోల్ పోసి పరిశీలిస్తే సగానికి పైగా నీళ్లే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల్లో మోసాలు వివిధ రూపాల్లో వెలుగులోకి వస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో చిప్ లు ఏర్పాటు చేసి మోసం చేస్తున్నారని, లీటర్ పెట్రోల్ కొటిస్తే 800 ఎంఎల్ నుంచి 900 ఎంఎల్ పెట్రోల్ వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ నాణ్యత కూడా బాగుండడంలేదని పేర్కొన్నారు. ఐదు లీటర్లు పెట్రోల్ కొట్టిస్తే లీటర్ వరకు నీరు ఉంటుందని మరో వాహనదారుడు తెలిపాడు. ఇప్పటికైనా తూనికలు–కొలతల శాఖ అధికారులు కళ్లు తెరిచి పెట్రోల్ బంకుల్లో సోదాలు నిర్వహించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యిని సరఫరా చేసి నష్టపోము: కెఎంఎఫ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News