Monday, December 23, 2024

ప్రియురాలిపై పెట్రోల్ పోసి… నిప్పంటించి

- Advertisement -
- Advertisement -

man committed suicidé in sircilla

రాంఛీ: వివాహితుడు ప్రియురాలిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహేష్ పురం గ్రామానికి చెందిన రాజేశ్ అనే యువకుడు, బాల్కీ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం రాజేశ్ మరో అమ్మాయితో తల్లిదండ్రుల పెళ్లి చేశారు. యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. రాజేశ్ అమెను కూడా పెళ్లి చేసుకుంటానని బతిమాలాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఒక ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇంట్లో వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో యువతి నిద్రిస్తుండగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే అక్కడి నుంచి రాజేశ్ పారిపోయాడు. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News