Monday, December 23, 2024

ఆస్తి తగాదాలు…. బాబాయ్ పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించి

- Advertisement -
- Advertisement -

స్థల వివాదం కారణంగా సొంత బాబాయ్ పిల్లలపై అఘాయిత్యం
విషమంగా పిల్లల ఆరోగ్యం మంటలో గాయపడ్డ నిందితుడు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం కాస్తా ఇద్దరు చిన్నారుల ప్రాణలమిదికి తెచ్చింది. భూ వివాదం నేపథ్యంలో సొంత బాబాయ్ కుమారులపై కక్షతో పెట్రోల్ పోసి చంపాలని కుట్ర పన్నాడో పెద్దనాన్న కుమారుడు. ఈ ఘటన ఖమ్మంలోని మేదర్‌బజార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థల వివాదంలో మేదర్ బజార్‌కు చెందిన అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. గురువారం సాయంత్రం ఉమాశంకర్ అనే వ్యక్తి తన బాబాయ్ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న బాబాయ్ ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

చుట్టుపక్కలవాళ్లు గమనించి పిల్లలను జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మేదర్‌బజార్‌కు చెందిన కోనా చిలకరావు, కోనా శ్రీనివాసరావులు అన్నదమ్ములు. వారు నివాసం ఉండే ఇంటి సమీపంలోని ఒక స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. దీనిపై పలుమార్లు ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. అప్పటి నుంచి చిలకరావు కుమారుడు ఉమా రాజశేఖర్ బాబాయ్‌పై పగ తీర్చుకోవాలని అదును కోసం వేచిచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు

శ్రీనివాసరావు భార్య మార్కెట్‌కు వెళ్లగా.. శ్రీనివాసరావు కూలీ పనికి వెళ్లాడు. ఈ సమయంలో శ్రీనివాసరావు ఇద్దరు పిల్లలు భార్గవ్ (15), వీరేందర్ (12) లు టివి చూస్తుండగా.. ఇదే అదునుగా భావించిన ఉమా రాజశేఖర్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇద్దరు పిల్లలపై పోసి నిప్పటించాడు. పెట్రోల్ వారిపై పోసేటప్పుడు అతనిపై కూడా పెట్రోల్ పడి మంటలంటుకున్నాయి. కాగా, కాలినగాయాలతో చిన్నారులు కేకలు విన్న స్థానికులు గమనించి ఇద్దరు పిల్లలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News