న్యూఢిల్లీ: గడచిన ఏడాది కాలంగా దేశంలో మొట్టమొదటిసారి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి ప్రారంభం తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు అత్యంత తక్కువకు పడిపోవడంతో లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు ధర తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.17 నుంచి రూ. 90.99కి తగ్గింది. అదే విధంగా లీటర్ డీజిల్ ధర రూ. 81.47 నుంచి రూ. 81.30కి చేరుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే ఆయా రాష్ట్రాలలో స్థానిక పన్నుల మేరకు వీటి ధరలలో వ్యత్యాసం ఉంటుంది. గడచిన ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. చివరిసారి 2020 మార్చి 16న చమురు ధరలు తగ్గాయి. గడచిన ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటర్‌పై రూ. 21.58 పెరిగింది. డీజిల్ ధర రూ.19.18 పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటేసింది. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళతోసహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఫిబ్రవరి చివరి నుంచి చమురు ధరల పెరుగుదల నిలిచిపోయింది.
పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -