Monday, January 20, 2025

పెట్రోపై మరోరోజువారి వాత

- Advertisement -
- Advertisement -

Petrol price hiked by 50 paise per liter and diesel by 55 paise

50, 55 పైసలు పెంపుదల

న్యూఢిల్లీ : మరోసారి దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎగబాకాయి. పెట్రోలు లీటరుకు 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ముడిచమురు ధరల మేరకు రోజువారిగా దాదాపుగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజువారి ధరల సమీక్ష పద్ధతిని తీసుకువచ్చిన దాదాపు వారంలోపే ఇప్పటి పెరుగుదలతో లీటర్ పెట్రోలుపై ధర రూ 3.70 పైసలు, డీజిల్‌పై రూ 3.75 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు పెట్రోలు ధర లీటరుకు రూ 99.11 పైసలు అయింది. ఇంతకు ముందు ఇది రూ 98.61 పైసలుగా ఉంది. ఇక డీజిల్ ధర లీటర్‌కు ఇంతకు ముందు రూ 89.87 పైసలుగా ఉంది. ఇది ఇప్పుడు రూ 90.42 పైసలు అయింది. పెరిగిన ధరలతో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఇప్పటి ఇంధన ధరల సూచి గురించి ఆదివారం ప్రభుత్వ ఇంధన రిటైలర్ సంస్థలు తెలిపాయి. స్థానిక పన్నులు ఇతరత్రా సుంకాలతో పెట్రోలు డీజిల్ ధరలు లీటరు వారిగా విభిన్నంగా ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News