వ్యాట్ తగ్గించిన కేజ్రీవాల్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ. 8 తగ్గనున్నది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్సు(వ్యాట్)ను 30 శాతం నుంచి 19.4 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ. 8 తగ్గనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాట్‌ను తగ్గించిన తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103 నుంచి రూ. 95కి తగ్గిపోనున్నది. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సిఆర్) పరిధిలోకి వచ్చే ఉత్తర్ ప్రదేశ్, హర్యానా నగరాలలో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పటివరకు ఎక్కువగా ఉన్నది. ఎన్‌సిఆర్ నగరాలలో పెట్రోల్‌పై వ్యాట్‌ను ఆయా రాష్ట్రాలు ఇప్పటికే తగ్గించాయి.