- Advertisement -
డీజిల్ ధర 25 పైసల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 20పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెంచాయి. దీంతో, లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.101.39కి, ముంబయిలో రూ.107.47కు చేరింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.89.57కి, ముంబయిలో రూ.97.21కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠం. దాంతో, చమురు సంస్థలు ధరలు పెంచినట్టుగా భావిస్తున్నారు. గత రెండు నెలల్లో పెట్రోల్ ధరను మొదటిసారి పెంచగా, డీజిల్ ధరను నాలుగుసార్లు పెంచాయి. ఈ నెల 24వరకు డీజిల్ ధరను నాలుగుసార్లు పెంచడంతో లీటర్‌కు 95 పైసలు అధికమైంది. చమురు ఉత్పత్తుల్లో 85 శాతాన్ని భారత్ దిగుమతులు చేసుకుంటోంది. దాంతో, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ప్రత్యక్షంగా పడుతోంది.
- Advertisement -