- Advertisement -
ఆగస్టులో తగ్గించేందుకు సిద్ధమవుతున్న ఆయిల్ కంపెనీలు
న్యూఢిల్లీ : వినియోగదారులు త్వరలో పెట్రోలు, డీజిల్ రేట్లకు సంబంధించి శుభవార్త విననున్నారు. నవంబర్‌డిసెంబర్ నుండి కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఒఎంసి) రేట్లను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండియన్ ఆయిల్, హెచ్‌పిసిఎల్ వంటి కంపెనీలు ఆగస్టులో పెట్రో ధరలను లీటరుకు 4 నుంచి 5 రూపాయలు వరకు తగ్గించే అవకాశముంది. ఆయిల్ కంపెనీలు లాభాల దిశగా పయనించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల పెట్రో ధరలను సవరించాలని భావిస్తున్నాయి. అయితే ఆయిల్ కంపెనీలు లాభాల్లోకి ఎన్నికల సమయంలో మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే కంపెనీలకు మార్కెటింగ్ ఫలితాలకు ముప్పు ఉంటుందని నివేదిక తెలిపింది. బ్యారెల్ రేటు 75 నుంచి 80 డాలర్ల వద్ద మద్దతును కొనసాగించేందుకు ఒపెక్ ప్లస్ ప్రయత్నిస్తోంది. ఇది పెరిగితే ఆయిల్ కంపెనీలపై ప్రభావం పడనుంది.
- Advertisement -