హైదరాబాద్: తెలంగాణలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ లో వంద దాటేసింది. పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల విరామం తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 27పైసలు, డీజిల్ పై 28 పైసల చోప్పున చమురు సంస్థలు ధరలు పెంచాయి. ఫలితంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 94.76 పైసలు, డీజిల్ 85.66 పైసలు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ 101.19 పైసలు, డీజిల్ 93.9పైసలకు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 98.48, డీజిల్ 93.38 పైసలుగా ఉంది. పెట్రోల్ ధరలు గత నెలలో 16 సార్లు పెరగగా, ఈ నెలలో రెండుసార్లు పెరిగాయి. 18 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ.4.36, డీజిల్ పై రూ.4.93లను ఇంధన సంస్థలు పెంచాయి.
petrol price reached rs 100 with 5 districts in telangana