Monday, December 23, 2024

పెట్రో ధరలూ దిగొస్తాయ్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పండుగ సీజ న్, 2024 సాధారణ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే యోచనలో ఉంది. ప్రజలకు ఊరట కల్గించే చర్యల దిశగా ప్రభు త్వం చర్చలు జరుపుతోందని సిటీగ్రూప్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ గ్యాస్ ధరల తగ్గింపు నిర్ణయంతో ద్రవ్యోల్బణం 30 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి,  బఖర్ ఎ.జైది తెలిపారు. తాజా నిర్ణయంతో కూరగాయల ధరలు కూడా తగ్గొచ్చని, వచ్చే నెల సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వచ్చే అవకాశముందని వారు వెల్లడించారు. జులైలో 15 నెలల గరిష్ఠానికి చేరిన రిటైల్ ధరలు, వీటిలో ప్రత్యేకించి ఆహార పదార్ధాల ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలను తగ్గించేందుకు అధికార యంత్రాంగాలు చురుగ్గా చర్యలు చేపడుతున్నాయి.

మంగళవారం ఎల్‌పిజి సిలిండర్ రేటు రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల 30 కోట్ల మంది వినియోగదారులకు ఊరట కల్గనుంది. ఆహార వస్తువుల ధరలకు చెక్ పెట్టేందుకు భారత్ ఇప్పటికే బియ్యం, గోదుమ, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో సామాన్యుడికి ధరల విషయంలో కొంత ఉపశమనం కల్గనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి నేపథ్యంలో వంట గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉంటుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సరఫరా కొరతతో ఉల్లి ధరల పెరుగుదల ఉండొచ్చు, వీటిని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాల్సి ఉంది. 2024 ప్రారంభంలో దేశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ధరల తగ్గింపు, గ్రామీణ ఆదాయం పెంచేందుకు మరికొన్ని చర్యలు చేపట్టే దిశగా చర్చలు జరుపుతున్నారని ఆర్థికవేత్తలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News