Thursday, January 23, 2025

ఏడు రోజుల్లో ఆరోసారి పెట్రో వడ్డన

- Advertisement -
- Advertisement -

పెట్రోల్‌పై 30పై, డీజిల్‌పై 35 పై. పెంపు

IEA revises up oil demand forecasts for 2022

 

న్యూఢిల్లీ: వారం రోజుల్లో ఆరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున సోమవారం ధరలు పెరిగాయి. దీంతో గత వారం రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 4 నుంచి రూ. 4.10 వరకు ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 99.41కు, లీటరు డీజిల్ రూ. 90.77కు చేరుకుంది. స్థానిక పన్నులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండడంతో డీజిల్, పెట్రోల్ ధరలు వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉన్నాయి. నాలుగున్నర నెలల విరామం అనంతరం మార్చి 22 నుంచి పెట్రల్, డీజిల్ ధరలు పెరగడం ఇది ఆరోసారి. మొదటి నాలుగుసార్లు లీటరుకు 80 పైసల చొప్పున ధరలు పెరగగా ఆదివారం పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసల చొప్పున వడ్డన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News