ఒకే నెలలో 13 సార్లు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగినట్లు మంగళవారం ఇంధన కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.44, డీజిల్ ధర రూ. 84.32కు చేరుకుంది. తాజా పెరుగుదలతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 99.71కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 91.57కి పెరిగింది. ఈనెలలో చమురు ధరలు పెరగడం ఇది 13వ సారి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని అనేక నగరాలలో పెట్రోల్ ధర ఇదివరకే వంద దాటేసింది. తాజా పెరుగుదలతో ముంబయి కూడా అదే రికార్డుకు చేరువలో ఉంది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ రూ. 104.42 ఉండగా, డీజిల్ ధర రూ. 97.18 ఉంది. ఇదే నెలలో లీటర్ పెట్రోల్‌పై రూ. 3.04, డీజిల్‌పై రూ. 3.59 పెరుగుదల ఉంది.