- Advertisement -
వాషింగ్టన్: అగ్రరాజ్యమైన అమెరికాలో పెట్రోల్ ధరలు గరిష్ఠస్థాయికి చేరాయి. అయినా మన దేశం ధరల కన్నా తక్కువే. ఓ గ్యాలన్ పెట్రోల్ ధర మార్చి 10న 4.31 డాలర్లు(అంటే రూ. 329కి) చేరింది. 2008 జూలైలో ఓ గ్యాలన్ పెట్రోల్ ధర 4.11 డాలర్లుగా ఉండేది. ఆ రికార్డు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. అమెరికాలో ఒక గ్యాలన్ అంటే 3.78 లీటర్లు. వివరంగా చెప్పాలంటే ఓ లీటరు పెట్రోల్ ధర అక్కడ దాదాపు రూ. 86.97కు చేరింది. ఇంతలా ధర పలకడం 14 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్యాలన్ పెట్రోల్ కాలిఫోర్నియాలో 5.69 డాలర్లు, నెవడాలో 4.87, హవాయిలో 4.81, ఒరేగావ్‌లో 4.72, వాషింగ్టన్‌లో 4.70 డాలర్లుగా ఉంది. గనించాల్సిన విషయమేమిటంటే కన్సాస్‌లో లీటర్ పెట్రోల్ రూ. 76.88కే లభిస్తోంది. ఇక ఓక్లహాలో రూ. 77.69కి లభిస్తోంది.
- Advertisement -