Monday, December 23, 2024

డా.రెడ్డీస్‌కు ఫైజర్ ‘బ్రెస్ట్ క్యాన్సర్’ డ్రగ్ హక్కులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతదేశం మార్కెట్‌లో వినియోగించేందుకు ఫైజర్ ప్రొడక్ట్ ఇండియా నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ ప్రిమ్సివ్ ట్రేడ్‌మార్క్ హక్కులను సొంతం చేసుకున్నట్టు శుక్రవారం డా.రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే 2022 మే నుంచి దేశంలో ప్రిమ్సివ్ బ్రాండ్ కింద పాల్బొసిక్లిబ్‌తో కూడిన డ్రగ్‌ను మార్కెటింగ్ చేస్తోంది.

ఈ హక్కుల స్వాధీనంతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్(ఎపిఐ), ఫినిష్డ్ డ్రగ్‌ను అమెరికా ఎఫ్‌డిఎ ఆమోదిత సౌకర్యాల వద్ద తయారీ చేయనున్నారు. ప్రస్తుత ఎంఆర్‌పి నుంచి 85 శాతం తగ్గింపుతో దేశీయ మార్కెట్‌లో ఉత్పత్తులను మార్కెట్ చేస్తారు. దీని ద్వారా పాల్బొసిక్లిబ్ యాక్సెస్‌ను పెంచవచ్చని డా.రెడ్డీస్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News