Monday, December 23, 2024

మార్చి 3న పిజి ఆయూష్ కన్వీనర్ కోటా

- Advertisement -
- Advertisement -

సీట్లకు భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్
జెఎన్‌టియుహెచ్‌లో సెంటర్ ఏర్పాటు

PG AYUSH Convener Quota on March 3

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పిజి ఆయుష్ కన్వీనర్ కోటా సీట్లకు మార్చి 3వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎండి ఆయుర్వేదం, హోమియోపతి, యూనాని కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది.అభ్యర్థులు మార్చ్ 3వ తేదీన కూకట్‌పట్టిలోని జెఎన్‌టియుహెచ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో హాజరై ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎండి హోమియో కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు , ఆయుర్వేదం ఉదయం 11 గంటలకు, యూనాని మధ్యాహ్నం 1 గంటకు నిర్ధేశించిన సెంటర్‌కు హాజరుకావాలి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www. knruhs.telangana.gov.inను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News